Latest Railway Notification 2026 | 10వ తరగతి తో రైల్వే లో 1421 ఉద్యోగాలు | RRB Jobs 2026

రైల్వేలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి East Coast Railway (ECoR) నుంచి భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. General Departmental Competitive Examination (GDCE) 2026 ద్వారా మొత్తం 1,421 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో Assistant Loco Pilot (ALP), Station Master, Goods Trains Manager, Junior Engineer, Technician, Junior Clerk cum Typist, Commercial Clerk cum Ticket Collector పోస్టులు ఉన్నాయి.

Telegram Group Join Now

మొత్తం 1,421 పోస్టులు

పోస్టుఖాళీలుPay Level
Assistant Loco Pilot (ALP)1,046Level-2
Station Master12Level-6
Goods Trains Manager284Level-5
Junior Engineer (JE)22Level-6
Technician51Level-2
Junior Clerk cum Typist4Level-2
Commercial Clerk cum Ticket Collector2Level-3
మొత్తం1,421

ALPలోనే 1,046 పోస్టులు

ఈ నోటిఫికేషన్‌లో అత్యధికంగా Assistant Loco Pilot పోస్టులు 1,046 ఉన్నాయి.

  • Sambalpur Division – 203
  • WAT Division – 300
  • Khurda Road Division – 543

మొత్తం – 1,046 పోస్టులు

Station Master – 12 పోస్టులు

Station Master పోస్టులకు మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి.

  • Sambalpur – 4
  • WAT – 8

ఈ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమానమైన అర్హత ఉండాలి. ఈ పోస్టుకు A-2 Medical Standard వర్తిస్తుంది.

Goods Trains Manager – 284 పోస్టులు

Goods Trains Manager పోస్టులకు మొత్తం 284 ఖాళీలు ఉన్నాయి.

  • Khurda Road – 120
  • WAT – 79
  • Sambalpur – 85

ఈ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా సమానమైన అర్హత అవసరం.

Junior Engineer – 22 పోస్టులు

Junior Engineer పోస్టులకు మొత్తం 22 ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత Engineering విభాగంలో Diploma లేదా B.Sc./Engineering అర్హత అవసరం.

Civil, Mechanical, Electrical తదితర సంబంధిత విభాగాల అభ్యర్థులకు పోస్టును బట్టి అవకాశం ఉంటుంది.

Technician – 51 పోస్టులు

Technician పోస్టులకు మొత్తం 51 ఖాళీలు ఉన్నాయి.

ఈ పోస్టులకు ప్రధానంగా 10వ తరగతి/SSLCతో పాటు సంబంధిత ITI లేదా Act Apprenticeship అర్హత అవసరం. పోస్టును బట్టి సంబంధిత ట్రేడ్ అర్హత ఉండాలి.

Junior Clerk cum Typist – 4 పోస్టులు

Junior Clerk cum Typist పోస్టులకు 4 ఖాళీలు ఉన్నాయి.

ఈ పోస్టుకు 12వ తరగతి ( ఇంటర్ ) లేదా సమానమైన అర్హత అవసరం. సాధారణంగా 50 శాతం మార్కుల నిబంధన ఉంటుంది. అయితే SC/ST, PwBD, అలాగే 12వ తరగతి కంటే ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులకు ఈ నిబంధనలో మినహాయింపు ఉంటుంది.

అలాగే కంప్యూటర్‌లో Englishలో 30 WPM లేదా Hindiలో 25 WPM టైపింగ్ స్పీడ్ ఉండాలి.

Commercial Clerk cum Ticket Collector – 2 పోస్టులు

ఈ పోస్టుకు మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్థులు 12వ తరగతి ( ఇంటర్ ) లేదా సమానమైన అర్హత కలిగి ఉండాలి. సాధారణంగా 50 శాతం మార్కుల నిబంధన ఉంటుంది. SC/ST, PwBD, ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుంది.

వయోపరిమితి

ఈ రిక్రూట్‌మెంట్‌లో 2027 జనవరి 1 నాటికి వయసును పరిగణనలోకి తీసుకుంటారు.

కేటగిరీవయసు
UR18–42 సంవత్సరాలు
OBC18–45 సంవత్సరాలు
SC/ST18–47 సంవత్సరాలు

జీతం ఎంత?

పోస్టును బట్టి 7వ పే కమిషన్ Pay Matrix ప్రకారం జీతం ఉంటుంది.

  • ALP – Pay Level-2
  • Station Master – Pay Level-6
  • Goods Trains Manager – Pay Level-5
  • Junior Engineer – Pay Level-6
  • Technician – Pay Level-2
  • Junior Clerk cum Typist – Pay Level-2
  • Commercial Clerk cum Ticket Collector – Pay Level-3

Pay Levelకు అనుగుణంగా ప్రాథమిక వేతనంతో పాటు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు లభిస్తాయి.

ఎంపిక విధానం

పోస్టును బట్టి ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

CBT → Aptitude Test/Typing Test → Document Verification → Medical Examination

ALP, Station Master వంటి పోస్టులకు Computer Based Aptitude Test (CBAT) ఉంటుంది. Junior Clerk cum Typist పోస్టుకు Typing Skill Test ఉంటుంది.

CBTలో తప్పు సమాధానాలకు 1/3 మార్కు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. అయితే CBATలో నెగెటివ్ మార్కింగ్ ఉండదు.

Station Masterకు CBAT

Station Master పోస్టుకు CBTలో అర్హత సాధించిన అభ్యర్థులను తదుపరి Computer Based Aptitude Testకు ఎంపిక చేస్తారు.

CBATకు ఖాళీలకు నిర్దిష్ట నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. మెరిట్ తయారీలో CBT, CBAT మార్కులకు వెయిటేజీ ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

వివరాలుతేదీ
నోటిఫికేషన్ విడుదల7 ఆగస్టు 2026
దరఖాస్తుల ప్రారంభం15 ఆగస్టు 2026
చివరి తేదీ14 సెప్టెంబర్ 2026

Official Notification : Click Here

I'm Mohan Reddy, a freelance content writer with 7 years of experience, skilled in SEO and digital marketing strategies. After witnessing the struggles today's job-seeking youth face, I started this platform to deliver accurate, verified job notifications. Every article is carefully researched and sourced only from official notifications.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top